Sunday, December 20, 2009

గాలి బుడగ ఈ జీవితము


గాలి బుడగ ఈ జీవితము
పల్లవి....   గాలి బుడగ ఈ జీవితము
            గమ్మత్తుగ చేరు మృత్యువును

అ. ప....  గమ్యమునెరిగిన గుణవంతుండు
           
మృత్యుంజయుడై మనుట తధ్యము

   1.   
విత్తమునందాసక్తిని వీడి
         
చిత్తము చిదంబరమ్మందుంచిన
         
దేహ భ్రెంతియే దూరమ్మగును
         
దివ్యమైన దర్శనమ్మగును

    2.   దేహియె తానని దేహము కాదని
         
దేహిని మృత్యువు చేరగలేదని
         
దేహియె సర్వము నిండియుండునను
         
సత్యమునెరిగి మృత్యుంజయుడగు


                           రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం  
                     


                 smkodav@gmail.com

http://www.scribd.com/doc/66015041/Guru-Dev                                 



Friday, December 18, 2009

పెద్ద నిధి యున్నను పేరెంత యున్నను








పెద్ద నిధి యున్నను పేరెంత యున్నను


ప.   పెద్ద నిధి యున్నను పేరెంతయున్నను
        పెద్ద నిద్దుర నెవరు తప్పించగలరు
అ.ప.ముద్దుముచ్చటలన్ని మృత్యువునుచేరు
         వద్దన్నవదలనివి చావు పుట్టుకలు


1. పుట్టిన ప్రతి జీవి గిట్టుట తధ్యము
    కట్టెయై మిగులును కాలమే తీరును
    చుట్టాలు పక్కాలు చుట్టు ప్రక్కలవారు
    పట్టుకొని పోవుదురు పాడె కట్టుకుని


2. తాత ముత్తాతలు రాజులు రౌతులు
    కాల గర్భములోన కన్ను మరుగైరి
    నీవును నేనును ఏనాటికైనను
    కైలాస భూమిలో  కాలవలసినదే


3. పెద్ద నిద్దుర లేని పరమాత్మ చేరెడి
   నిద్దురయె తెలివియగు నిజమొకటి కలదు
   సద్దు సేయక మనసు సంధ్యనే తిలకింప
   అద్భుతంబగు జ్యోతి అంతరమ్మున వెలయు 


4. జీవన్ముక్తుడై యుండగలిగెడి యుక్తి
    జీవించి యుండగనె పొందగలిగెడి శక్తి
    జీవి యందెల్లపుడు జీవించి యుండు
    జీవ భావము వీడ దైవత్వమబ్బు


                            రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం

                                   smkodav@gmail.com

Thursday, December 17, 2009

మాయ కాయమ్మిది జీవా


          మాయ కాయమ్మిది జీవా

ప. మాయ కాయమ్మిది జీవా దీని
   
మాయలో పడి చెడకు జీవ
1. ఆసలెన్నొ పడుచు నుందువు
   
శ్వాస వున్న వరకె చెల్లును
   
శ్వాస వీడిన ఆస వీడును
   
వీసమైన వెంట రాదుగా 

2.కట్టె కట్టెల కాలునప్పుడు
  
మట్టిలోనను కలియునప్పుడు
   కట్టు కొన్నవి కానరావుగా
 
   కట్టెపైనను మోజు దండగ

   
3.దేహమందుండును దేహియే
  
దేహము కాదు నువు దేహివి
  
దేహ భ్రాంతిని మదిని వీడిన
  
దేహియే దైవమై వెలయును
    
4.మోహమనునది నాశమందుట
  
మోహక్షయమందుటెమోక్షము
  
దేహధారియే దైవము సం
  
దేహములేదిదియె  సత్యము
                   రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
                           smkodav@gmail.com

Wednesday, December 16, 2009

ఎంత మొత్తుకున్న ఏమి లాభమున్నది


       ఎంత మొత్తుకున్న ఏమి లాభమున్నది
 
ప..ఎంత మొత్తుకున్న ఏమి లాభమున్నది
   
చిత్తమేమొ శివునియందుండకున్నది

1.
చిన్నతనమునందు ఎన్నొ ఆట పాటలాయె
   
పెరుగుచున్నకొలది పలు ఆటుపోటులాయె
   
ముచ్చట్లేతీరకుండ ముదిమివయసుదాపురించె
   
ఆరొగ్యము అంతయు అంతరించుచుండెనే
2. చిత్తమేమొ చంచలమ్మగుచునున్నది
   
విత్తమందు ఆశ మాసిపోకనున్నది
   
పెత్తనమందే మనసు పడుతునున్నది
   
కత్తిమీద సామువలె కాలమున్నది
3. పుట్టి గిట్టి మట్టిగొట్టు మలినమే ఇది
   
మధ్యలోన మాయ బ్రతుకు ముచ్చటేమది
   
జీవిత పరమార్ధమ్ము వున్నదంట
   
అదిఏది తెలియక అల్లాడుతుంట

                    
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
                      smkodav@gmail.com

Followers

About Me

My photo
Visakhapatnam, Andhrapradesh, India
Suggestions may be sent to smkodav@gmail.com